Minister Duddilla Sridhar Babu : ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి
భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మంథని నియోజకవర్గ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
దిశ, కాటారం : భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మంథని నియోజకవర్గ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలు వరద నీటి ప్రవాహాల వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని,
ప్రజలకు అన్ని విధాలా సహాయ సహకారాలను అందించాలని జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులను ఆదేశించారు. శిథిలావస్థలో ఉండి కూలిపోయే పరిస్థితిలో ఉన్న ఇండ్లలో ఉండేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వాగులు చెరువుల నీరు చేరే అవకాశం ఉన్న లోతట్టు గ్రామాల ప్రాంత ప్రజలను గుర్తించి వారిని సురక్షిత ప్రదేశాలకు అధికారులు వెంటనే తరలించాలని కోరారు. చెరువులు, కాలువలు, కుంటల వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు ఉన్నచోట జాగ్రత్త వహించాలని సూచించారు. గోదావరినది పరీవాహక ప్రాంతాల్లో పశువులను మేపడానికి, చేపలు వేటకు వెళ్లవద్దన్నారు.