ప్రశాంత్‌పై చర్యలకు పునరాలోచించాలి: జర్నలిస్టులు
టెన్త్ హిందీ ప్రశ్నాపత్రాన్ని మీడియా, మీడియేతర వాట్సాప్ గ్రూపుల్లో చేశాడనే కారణంతో సీనియర్ జర్నలిస్టు ప్రశాంత్‌ను అరెస్ట్ చేయడంపై పునరాలోచించాలని జర్నలిస్టులు వరంగల్ సీపీ రంగనాథ్‌కు వినతిపత్రం అందజేశారు.
దిశ, వరంగల్ బ్యూరో: టెన్త్ హిందీ ప్రశ్నాపత్రాన్ని మీడియా, మీడియేతర వాట్సాప్ గ్రూపుల్లో చేశాడనే కారణంతో సీనియర్ జర్నలిస్టు ప్రశాంత్‌ను అరెస్ట్ చేయడంపై పునరాలోచించాలని జర్నలిస్టులు వరంగల్ సీపీ రంగనాథ్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రశాంత్ ఉద్దేశపూర్వకంగా వాట్సాప్ గ్రూపుల్లో హిందీ ప్రశ్నాపత్రాన్ని ఫార్వర్డ్ చేసి ఉండడని భావిస్తున్నట్లుగా సీపీకి అందజేసిన వినతిలో జర్నలిస్టులు పేర్కొన్నారు. జర్నలిస్టులకు సమాచారం ఇవ్వాలనే ఉద్దేశంతోనే కొన్ని గ్రూపుల్లో ఆయన ఫార్వర్డ్ చేసినట్లుగా జర్నలిస్టులు వినతిలో పేర్కొన్నారు.
అతనిపై నమోదు చేసిన కేసును నిలిపివేయాలని ఈ సందర్భంగా సీపీ ఏవీ రంగనాథ్‌ను కోరడం జరిగింది. వినతి అందజేసిన వారిలో గ్రేటర్ వరంగల్ ప్రెస్‌క్లబ్ కార్యదర్శి సదానందం, వరంగల్ ఎన్టీవీ బ్యూరో చీఫ్ అరుణ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి బ్యూరోచీఫ్ దొంతు నవీన్, దిశ వరంగల్ బ్యూరో చీఫ్ ఆరెల్లి కిరణ్, టీవీ9 బ్యూరో పెద్దిష్, వీ6 బ్యూరో చీఫ్ కృష్ణ మోహన్, రాజ్ న్యూస్ బ్యూరో సతీష్, 10టీవీ బ్యూరో కంచ కుమారస్వామి, మహాటీవీ బ్యూరో సుధాకర్, సాక్షి టీవీ బ్యూరో, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ బ్యూరో మహేష్, టైమ్స్ ఆఫ్ ఇండియా బ్యూరో పిన్న శివకుమార్ తదితరులున్నారు.