ఎండవేడికి ద్విచక్ర వాహనంలో చెలరేగిన మంటలు..
భానుడి భగభగల సెగలకు పట్టణ ప్రజలు అల్లాడుతున్నారు.
దిశ, ఏటూరునాగారం : భానుడి భగభగల సెగలకు పట్టణ ప్రజలు అల్లాడుతున్నారు. ఒకవైపు ఏజెన్సీ అటవీ ప్రాంతంలో కూడా భానుడి వేడి సెగలకు ప్రజల అల్లలాడుతున్నారు. ఈ మేరకు ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో భానుడి వేడి సెగలకు ద్విచక్ర వాహనం దగ్ధమైన ఘటన నెలకొంది.
పూర్తివివరాల్లోకెళితే వాజేడు మండలానికి చెందిన కోరం సాయి పనినిమిత్తం తన ద్విచక్ర వాహనం పల్సర్ 220 సీసీ బండి పై ఏటూరునాగారంకు వెళ్లి బస్టాండ్ ఆవరణలో గల ఒక షాపు ముందు తన వాహనాన్ని పార్క్ చేశాడు. కాగా ఎండ వేడి అధికంగా ఉండడంతో ద్విచక్ర వాహనంలో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన చూసిన స్థానికులు అప్రమత్తమై బొంత, నీటి సహాయంతో మంటలను ఆర్పేశారు. ఎండ వేడితో వచ్చిన మంటల కారణంగా ద్విచక్ర వాహనాన్ని నష్టపోయిన సాయి కన్నీటి పర్యంతం అయ్యాడు.