బీఆర్ఎస్ నాయకులపై ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కేసు నమోదు
ఖిలా వరంగల్ లోని కాకతీయుల కళా తోరణం వద్ద బుధవారం
దిశ,ఖిలా వరంగల్ : ఖిలా వరంగల్ లోని కాకతీయుల కళా తోరణం వద్ద బుధవారం బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర చిహ్నం లోని కాకతీయ కళాతోరణం తొలగింపు ప్రక్రియకు వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. ఆ కారణంగా వారి మీద మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయినది. కాకతీయ కళాతోరణం కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్నది. బీఆర్ఎస్ నాయకులు అనుమతి లేకుండా పురావస్తు శాఖ ఆవరణలోకి వెళ్లినందుకు సెక్షన్ 143 కింద, ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి నిరసన కార్యక్రమాలు చేపట్టినందుకు ఏడుగురు బీఆర్ఎస్ నాయకుల మీద కేసు నమోదు అయింది.