మల్లూరువాగు ప్రాజెక్టులోకి 0.229 టీఎంసీ వరదనీరు

మండలంలోని నర్సింహాసాగర్ బాలన్నగూడెం పంచాయతీల పరిధిలో నిర్మించిన మల్లూరు వాగు మద్యతరహా ప్రాజెక్టులోకి 0.190 టీఎంసీల వరదనీరు చేరి జలకళ సంతరించుకుంది.

Update: 2024-07-21 06:10 GMT

దిశ, మంగపేట : మండలంలోని నర్సింహాసాగర్ బాలన్నగూడెం పంచాయతీల పరిధిలో నిర్మించిన మల్లూరు వాగు మద్యతరహా ప్రాజెక్టులోకి 0.229 టీఎంసీల వరదనీరు చేరి జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 115.25 మీటర్లు కాగా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రస్తుత నీటి మట్టం 113.40 మీటర్లకు చేరింది. పూర్తి సామర్థ్యం 0.367 టిఎంసీలుండగా 0.229 టిఎంసీల నీటిమట్టంకు చేరడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 620క్యూసెక్కుల వరద ఇన్ ప్లో చేరుతుండడంతో ఈ సంవత్సరం ఖరీఫ్, రబీ పంటల సాగునీటి అవసరాలు తీరతాయని రైతులంటున్నారు. ప్రాజెక్టు గేట్లు, కుడి, ఎడమ కాలువల మరమ్మత్తులు చేయించాలని లీకేజీలతో ప్రాజెక్టులో చేరిన వరద గోదావరి పాలు కాకుండా ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Tags:    

Similar News