Warangal: యువకుడికి సీపీఆర్ చేసి కాపాడిన కానిస్టేబుల్.. నెట్టింట ప్రశంసలు

తోపులాటలో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఓ యుకుడికి డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ సీపీఆర్ చేసి ప్రాణాలు రక్షించాడు.

Update: 2024-10-13 07:52 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తోపులాటలో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఓ యుకుడికి డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ సీపీఆర్ చేసి ప్రాణాలు రక్షించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దసరా పండుగ సందర్భంగా.. వరంగల్ రంగలీల మైదానంలో రావణవధ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్దఎత్తున హాజరుకావడంతో తోపులాట చోటుచేసుకుంది. ఇందులో ఓ యువకుడు ఊపిరి ఆడక అపస్మారక స్థితిలోకి వెళ్లి పడిపోయాడు. ఇది గమణించిన పోలీసులు అతన్ని పక్కకి తీసుకొని వచ్చారు. ఆ యువకుడు హార్ట్ ఎటాక్ కు గురయ్యాడని తెలుసుకున్న ఓ కానిస్టేబుల్ సీపీఆర్ చేయడం ప్రారంభించాడు. ఆ వ్యక్తి స్పృహలోకి వచ్చే వరకు కానిస్టేబుల్ తన రెండు చేతులతో గుండెపై గట్టిగా తడుతూ.. ప్రాణాలు కాపాడాడు. అనంతరం ఆ వ్యక్తిని అంబులెన్స్ లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. సకాలంలో స్పందించి సీపీఆర్ చేసి ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. హ్యాట్సాఫ్ సర్ అని సెల్యూట్ కొడుతున్నారు.


Similar News