కమ్యూనిస్టుల మద్దతు కావాలి! మంత్రి పొన్నం ఆసక్తికర ట్వీట్
గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్, సీపీఐ పార్టీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సీపీఐ, కాంగ్రెస్ మధ్య పొత్తు విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు.
దిశ, డైనమిక్ బ్యూరో: గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్, సీపీఐ పార్టీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సీపీఐ, కాంగ్రెస్ మధ్య పొత్తు విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. సీపీఐ మాత్రం మిత్ర ధర్మంగా ఒక్క ఎంపీ సీటు అయిన తమకు ప్రకటించాలని కాంగ్రెస్ ముందు డిమాండ్ పెట్టింది. కరీంనగర్, వరంగల్ ఎదో ఒక స్థానం ఇవ్వాలని కాంగ్రెస్‌ను కోరుతున్నది. కానీ కాంగ్రెస్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
కమ్యూనిస్టు పార్టీలను ఉద్దేశించి మంత్రి పొన్నం ప్రభాకర్ ఇవాళ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ లోక్ సభ సీటుకి సంబంధించి తాజా రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా సీపీఐ, సీపీఎం పార్టీలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను!’అని విజ్ఞప్తి చేశారు. కాగా, కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 13 ఎంపీ స్థానాలను ప్రకటించింది. ఇంకా కరీంగనర్, ఖమ్మం, హైదరాబాద్, వరంగల్ ఎంపీ స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. ఇక్కడి అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తున్నది. అయితే మంత్రి కోరికపై కమ్యూనిస్టు పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి.