బస్ డ్రైవర్ అవతారం ఎత్తిన ఎమ్మెల్యే

వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి బుధవారం కొద్దిసేపు బస్ డ్రైవర్ అవతారం ఎత్తారు.

Update: 2024-08-07 14:34 GMT

దిశ, వెబ్ డెస్క్ : వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి బుధవారం కొద్దిసేపు బస్ డ్రైవర్ అవతారం ఎత్తారు. వనపర్తి పట్టణంలో బస్ నడుపుతూ అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. వివరాల్లోకి వెళితే.. వనపర్తి పట్టణంలో లోకల్ బస్సులు నడపాలని కొన్నేళ్లుగా గత ప్రభుత్వానికి వినతి పత్రాలు అందజేశారు పట్టణ ప్రజలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న ఎమ్మెల్యే మేఘారెడ్డి డిపో మేనేజర్ తో మాట్లాడి వెంటనే లోకల్ బస్సులు ఏర్పాటు చేశారు. బస్ సర్వీసులు ప్రారంభించాం కదా అని అంతటితో వదిలేయకుండా స్వయంగా తానే స్టీరింగ్ పట్టి బస్ నడిపారు. పట్టణంలో దాదాపు 10 కిమీల మేర బస్ నడిపి ప్రయాణికులను ఎక్కించుకోవడం, దింపడం చూసి ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఎమ్మెల్యే బస్ నడుపుతున్నారని తెలుసుకున్న పట్టణ ప్రజలు ఆయన్ని చూసేందుకు ఎగబడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ.. వనపర్తి పట్టణ విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే స్వయంగా తాను రంగంలోకి దిగానని అన్నారు. అలాగే వనపర్తి నియోజక వర్గంలోని ప్రతి గ్రామానికి బస్ సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. 


Similar News