డీజేలపై డీజీపీ కీలక నిర్ణయం

రాష్ట్రంలో జరిగిన వినాయక నిమజ్జనాలపై తెలంగాణ డీజీపీ(Telangana DGP) జితేందర్ వివరాలను మీడియాకు వెల్లడించారు.

Update: 2024-09-24 12:28 GMT

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో జరిగిన వినాయక నిమజ్జనాలపై తెలంగాణ డీజీపీ(Telangana DGP) జితేందర్ వివరాలను మీడియాకు వెల్లడించారు. రాష్ట్రం మొత్తంలో 1,36,638 వినాయక విగ్రహాలను, 5,879 పాయింట్ల వద్ద నిమజ్జనం చేసినట్టు ప్రకటించారు. ఇక హైదరాబాద్(Hyderabad) నగరంలోని పలు కమిషనరేట్స్ పరిధిలో వినాయక నిమజ్జనాలతో పాటు,. మిలాద్ ఉన్ నబీ ప్రశాంతంగా పూర్తి చేసినందుకు పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. అయితే డీజేల శబ్దం కాలుష్యం చాలా మందిని ఇబ్బంది పెట్టిందని, డీజేల నిర్వహణపై త్వరలోనే మార్గదర్శకాలు రూపొందిస్తామని డీజీపీ పేర్కొన్నారు.

అలాగే ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) కేసుపై స్పందిస్తూ.. ప్రత్యేక బృందాలచేత విచారణ జరుగుతోందని పేర్కొన్నారు. నిందితులకు ఇప్పటికే ఇంటర్ పోల్ (Inter Poll) ద్వారా రెడ్ కార్నర్(Red Corner) నోటీసులు జారీ చేయించామని తెలిపారు. కోర్టు పరిధిలో ఈ అంశం ఉండటం చేత ఎక్కువ వివరాలు ప్రకటించలేనని అన్నారు. ఇక జైనూర్ ఘటనపై మాట్లాడుతూ.. లైంగిక దాడి గురించి బయటకి వచ్చిన అనంతరం జరిగిన అల్లర్ల ఘటనలో ఇప్పటికే 39 మందిని అరెస్టు చేశామని, అల్లర్లను కంట్రోల్ చేయని కారణంగా డీఎస్పీని సస్పెండ్ చేశామని డీజీపీ జితేందర్ మీడియాకు వెల్లడించారు.    


Similar News