కేసీఆర్.. పంచాయతీ కార్యదర్శులను బెదిరించడం దుర్మార్గం: సర్దార్ వినోద్

తెలంగాణ జూనియర్ పంచాయతీ కార్యదర్శులను, ఓపీఎస్‌లను రేపటిలోగా విధుల్లో చేరకుంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని కేసీఆర్

Update: 2023-05-08 14:22 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ జూనియర్ పంచాయతీ కార్యదర్శులను, ఓపీఎస్‌లను రేపటిలోగా విధుల్లో చేరకుంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని కేసీఆర్ ప్రభుత్వం బెదిరించడం దుర్మార్గమని తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం(వీజేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు వారి హక్కుల కోసం, కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని సమ్మె చేస్తే వారిని బెదిరించి లొంగదీసుకోవడానికి కేసీఆర్ ప్రభుత్వం వారికి నోటీసులు జారీ చేసిందన్నారు. రేపు సాయంత్రం విధుల్లో చేరాలని నోటీసుల్లో ప్రభుత్వం పేర్కొన్నదన్నారు.

విధుల్లో చేరకుంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని కార్యదర్శులకు ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతున్నదని విమర్శించారు. పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా నోటీసులు జారీ చేయడం దురదృష్టకరమని, కేసీఆర్ ఈ బెదిరింపులు మానుకోవాలని హితవుపలికారు. ఈ బెదిరింపులు మానకుంటే కార్యదర్శులకు ప్రభుత్వం టెర్మినేట్ చేయడం కాదు.. ఆయన ప్రభుత్వానికి కొద్ది నెలల్లోనే తెలంగాణ ప్రజలే టెర్మినేట్ చేస్తారని తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు ఎవరు అధైర్య పడొద్దని మీకు తెలంగాణ సమాజం అండగా ఉంటుందని మీ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కోట్లాడతామని పేర్కొన్నారు.

Tags:    

Similar News