Independence Day : ‘వికసిత్ భారత్ @ 2047’ ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ థీమ్ ఇదే..

భారతదేశం తన 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆగస్టు 15, 2024 గురువారం జరుపుకోవడానికి రెడీ అవుతోంది.

Update: 2024-08-14 11:51 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: భారతదేశం తన 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆగస్టు 15, 2024 గురువారం జరుపుకోవడానికి రెడీ అవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటలో ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న స్వాతంత్ర్య సమరయోధులు, నాయకులును వారు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటారు. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ దినోత్సవ థీమ్‌ను కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ‘వికసిత్ భారత్ @ 2047’ 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చే దిశగా మోడీ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలకు పునరుత్తేజాన్ని అందించేందుకు ఈ వేడుకలు ఓ వేదికగా ఉపయోగపడతాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, స్వాతంత్ర్య వేడుకలకు ఎర్రకోట ముస్తాబు అయింది.

ఈ వేడుకల్లో పంచాయతీ రాజ్ సంస్థల నుంచి 400 మంది మహిళలను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. మరోవైపు యువకులు, గిరిజన సంఘం, రైతులు ఇలా వివిధ రంగాలకు చెందిన 6 వేల మందిని ప్రత్యేక అతిథులను కూడా ఆహ్వానించారు. ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత బృందాన్ని సైతం వేడుకలకు ఆహ్వానించారు. కాగా, ప్రధాని మోడీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, ఐకానిక్ స్మారక ప్రాకారాల నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగం చేస్తారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..