బండి సంజయ్ కు మద్దతుగా సినీ హీరో!.. నా మిత్రుడ్ని గెలిపించాలని వీడియో విడుదల

దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ కొందరు సినీ సెలబ్రెటీలు పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్ధులకు మద్దతుగా నిలుస్తున్నారు.

Update: 2024-05-11 14:15 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ కొందరు సినీ సెలబ్రెటీలు పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్ధులకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నేపధ్యంలోనే కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా బరిలో ఉన్న బండి సంజయ్‌కు సినీ హీరో సుమన్ మద్దతుగా నిలిచారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సభ్యుడిగా బండి సంజయ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని వీడియో విడుదల చేశారు. సుమన్ మాట్లాడుతూ.. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్ధిగా నా మిత్రుడు బండి సంజయ్ పోటీ చేస్తున్నారని, బండి సంజయ్ గురించి అందరికీ తెలుసని, ఆయన ఎన్నో వేల కోట్లు తీసుకొచ్చి కరీంనగర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారని, యువతకు ఉపాధి చూపించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపించారని తెలిపారు. కరోనా సమయంలో చాలా కష్టపడి పనిచేసి చాలా మందిని ఆదుకున్నాడని, బండి సంజయ్ మంచి మనిషి, కష్టపడి పని చేసే వ్యక్తి అని, మీ ఆశీర్వాధం ఆయనకు ఉండి ఒక ఉన్నత స్థాయిలో చూడాలని అనుకుంటున్నట్లు చెప్పారు. అలాగే కరీంనగర్ లో అత్యధిక మెజారిటీతో బండి సంజయ్ ను గెలిపించాలని సుమన్ కోరారు.


Similar News