సీఎంను చేస్తే కిరణ్ కుమార్ రెడ్డి చావు దెబ్బకొట్టాడు: వీహెచ్ కీలక వ్యాఖ్యలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెళ్తూ వెళ్తూ టీ కాంగ్రెస్‌ను చావుదెబ్బకొట్టి వెళ్లాడని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెళ్తూ వెళ్తూ టీ కాంగ్రెస్‌ను చావుదెబ్బకొట్టి వెళ్లాడని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు టీ కాంగ్రెస్‌ను చాలా నష్టపరిచాయన్నారు. శుక్రవారం గాంధీ భవన్‌లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో మాట్లాడిన వీహెచ్.. కిరణ్ కుమార్ రెడ్డిని సీఎం చేసిన సందర్భంలోనే పీసీసీ, సీఎం రెండు పదవులు ఆంధ్రవారికేనా అని తాను ఓ సీనియర్‌ను ప్రశ్నించానన్నారు. అయితే ఎలాగు తెలంగాణ వస్తుంది కదా అని అవతలి వ్యక్తి సమాధానం ఇచ్చాడని.. కానీ కిరణ్ కుమార్ రెడ్డి వెళ్తూ వెళ్తూ మా పని చేశాడని మండిపడ్డారు.
మీరాకుమారి లోక్ సభ స్పీకర్‌గా లేకుంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు పోరాటం చేశారని అందువల్లే తెలంగాణ ఏర్పడిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో అందరికంటే సీనియర్‌ను నేనే అన్నారు. 1969 ఉద్యమంలో మర్రిచెన్నారెడ్డి, మల్లికార్జున వెంట పని చేసిన వ్యక్తిని తాను అన్నారు. ఉద్యమం గురించి తనకు అనేక విషయాలు తెలుసని, కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుందని అందుకే మౌనంగా ఉన్నట్లు చెప్పారు.
Also Read..
‘ఆమె లేకుంటే.. కేసీఆర్ తలకిందులుగా తపస్సు చేసినా తెలంగాణ వచ్చేది కాదు’