పాక ఇడ్లీకి వెంకయ్య నాయుడు ఫిదా.. భారతీయ వంటలను కాపాడుకోవాలంటూ ట్వీట్
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మన సంప్రదాయాలకు ఎంత విలువ ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
దిశ, వెబ్ డెస్క్: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మన సంప్రదాయాలకు ఎంత విలువ ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు ఆసక్తికర పోస్ట్‌లు షేర్ చేస్తాడు. తాజాగా, వెంకయ్య నాయుడు తోటి నాయకులతో కలిసి విజయవాడకు వెళ్లారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎంప్లాయిస్ కాలనీలోని sss పాక హోటల్‌లో ఇడ్లీకి ఫిదా అయ్యారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘‘ఈ రోజు ఉదయం విజయవాడ లోని SSS పాక హోటల్ లో చక్కటి ఇడ్లీని ఆస్వాదించాను. నోరూరించే వేరుశనగ పచ్చడి, అల్లం పచ్చడి, కారప్పొడి, నెయ్యితో ఈ ఇడ్లీలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉన్నాయి. గుబురు చెట్ల నీడన, సంప్రదాయం ఉట్టిపడే ఈ పాక హోటల్లో ఒకసారైనా ఇడ్లీ రుచి చూడాలి. మంచి రుచికరమైన ఇడ్లీని అందిస్తున్న నిర్వాహకులకు, సిబ్బందికి అభినందనలు. బలవర్ధకమైన మన భారతీయ సంప్రదాయ వంటలను, రుచులను కాపాడుకోవాలి’’ అంటూ వరుస ట్వీట్లు షేర్ చేశారు.
గుబురు చెట్ల నీడన, సంప్రదాయం ఉట్టిపడే ఈ పాక హోటల్లో ఒకసారైనా ఇడ్లీ రుచి చూడాలి. మంచి రుచికరమైన ఇడ్లీని అందిస్తున్న నిర్వాహకులకు, సిబ్బందికి అభినందనలు. బలవర్ధకమైన మన భారతీయ సంప్రదాయ వంటలను, రుచులను కాపాడుకోవాలి. pic.twitter.com/2US6uR7tw8
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) May 2, 2023