ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. హైదరాబాద్-విజయవాడ హైవైపై వెళ్తున్నారా?
దసరా(Dussehra) వచ్చిందంటే చాలు అంతా నగరాలను వదిలి పల్లెలకు వెళ్తుంటారు.
దిశ, వెబ్‌డెస్క్: దసరా(Dussehra) వచ్చిందంటే చాలు అంతా నగరాలను వదిలి పల్లెలకు వెళ్తుంటారు. దసరాకు ముందే బతుకమ్మ పండుగ కూడా ఉండటంతో రెండు మూడు రోజుల ముందే ప్రయాణాలను ప్లాన్ చేస్కుంటారు. ఈ క్రమంలోనే పండుగకు ముందు రోజు హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని హైదరాబాద్-విజయవాడ హైవే(Hyderabad-Vijayawada Highway)పై నున్న పంతంగి టోల్‌ప్లాజా(Panthangi Toll Plaza) వద్ద మరోసారి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
పండుగకు ఊరు వెళ్లే ప్రయాణికులంతా ఒక్కసారిగా వాహనాలతో రోడ్డెక్కడంతో టోల్‌ప్లాజా కిక్కిరిసిపోయింది. దీంతో పోలీసులు ఊర్లకు వెళ్లేందుకు వేరే మార్గాలను ఎంచుకోవాలని సూచనలు చేస్తున్నారు. ట్రాఫిక్ నివారించేందుకు పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. టోల్‌ప్లాజాతో పాటు చౌటుప్పల్ మండల పరిధిలోని దండు మైలారం, దండు మల్కాపురం, ఖైతాపురం, ధర్మోజిగూడెం, అంకిరెడ్డిగూడెం, పంతంగి, గుండ్లబావి క్రాసింగ్‌ల వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.