కాకరేపుతోన్న ‘‘సెప్టెంబర్ 17’’.. సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్
సెప్టెంబర్ 17 తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమైన రోజును రాష్ట్రంలోని ఒక్కొ పార్టీ ఒక్కొ పేరుతో నిర్వహిస్తున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: సెప్టెంబర్ 17 తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమైన రోజును రాష్ట్రంలోని ఒక్కొ పార్టీ ఒక్కొ పేరుతో నిర్వహిస్తున్నాయి. సెప్టెంబర్ 17ను టార్గెట్ చేసుకుని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ విమర్శల వర్షం కురిపించుకుంటున్నాయి. దీంతో స్టేట్ పాలిటిక్స్‌లో సెప్టెంబర్ 17 రాజకీయ రంగు పులుముకుంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 17వ తేదీపై సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి, స్టేట్ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. సెప్టెంబర్ 17వ తేదీని బీఆర్ఎస్ జాతీయ సమైక్యత దినోత్సవం అంటుందని.. అసలు సమైక్యత దినోత్సవం ఎలా అవుతోందో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై పరకాల అమరధామం దగ్గర కేసీఆర్ చర్చకు రావాలని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. అమరవీరులకు నివాళులు అర్పించే దమ్ము కేసీఆర్‌కు లేదని.. అందుకే ఆయన సెప్టెంబర్ 17వ తేదీని సమైక్యత దినోత్సవం అంటున్నారని విమర్శించారు.