17న తెలంగాణకు ‘బీఎస్‌కే’.. గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు స్టేట్ బీజేపీ ప్లాన్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈనెల 17వ తేదీన తెలంగాణకు రానున్నారు. కేంద్ర మంత్రి పదవి పొందిన అనంతరం
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈనెల 17వ తేదీన తెలంగాణకు రానున్నారు. కేంద్ర మంత్రి పదవి పొందిన అనంతరం తొలిసారి తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో బండి సంజయ్‌కి స్టేట్ బీజేపీ యూనిట్ గ్రాండ్ వెల్కమ్ చెప్పనుంది. అనంతరం 17న ఆయన హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో నిర్వహించనున్న సమావేశంలో ఆయన పాల్గొంటారు. అనంతరం మూడ్రోజుల పాటు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో సంజయ్ పర్యటించనున్నారు.