బండి ఇన్ యాక్షన్.. మెదక్ అల్లర్ల ఘటనపై కేంద్ర మంత్రి ఆరా

మెదక్ అల్లర్లపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోం శాఖ సహయ మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్

Update: 2024-06-16 10:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: మెదక్ అల్లర్లపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోం శాఖ సహయ మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేసిన బండి.. మెదక్‌లోని తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అంశాతిని నెలకొల్పేలా ఎవరు వ్యవహరించినా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్ పోలీసులకు సూచించారు. అమాయకులపై అక్రమ కేసులు పెట్టొద్దని ఆదేశించారు. పోలీసులు నిష్ఫక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. కాగా, జంతువధ, గోవుల తరలింపు విషయంలో శనివారం రాత్రి మెదక్ పట్టణంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది.

ఈ ఘటనలో ఓ వర్గానికి చెందిన వారికి గాయాలు అయ్యాయి. దీంతో మెదక్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వెంటనే రంగ ప్రవేశం చేసిన పోలీసులు లాఠీ చార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా ముందు జాగ్రత్తలో భాగంగా మెదక్‌లో భారీగా పోలీసులను మోహరించారు. అల్లర్ల నేపథ్యంలో బీజేపీ ఇవాళ మెదక్ బంద్‌కు పిలుపునిచ్చింది. ప్రస్తుతం మెదక్ వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకుండా పెద్ద ఎత్తున పోలీసులను రంగంలోకి దింపారు.  


Similar News