అనూహ్య ఘటన.. ట్యాంక్ బండ్ పై భారీగా ట్రాఫిక్ జామ్..

హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ సమీపంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది.

Update: 2024-09-04 06:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ లోని ట్యాంక్‌బండ్(Tank bund)సమీపంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఈ నెల 7 వినాయక చవితి(vinayaka chaviti) సందర్భంగా గణపతి విగ్రహం తరలిస్తుండగా.. అదుపుతప్పిన విగ్రహం రోడ్డుపై పడిపోయింది. దీంతో ట్యాంక్ బండ్ పై పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్(Traffic jam) ఏర్పడింది. దీంతో విగ్రహం నిర్వాహకులు.. స్థానికులు, పోలీసుల సహాయంతో భారీ విగ్రహాన్ని పక్కకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. భారీ విగ్రహం కావడంతో ఒక్కసారిగా పక్కకు ఒరగడం తో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మూడు రోజుల పాటు భారీ వర్షాలు కువడంతో దూల్‌పేట్ నుంచి నగర శివార్లకు తరలి వెళ్లాల్సిన విగ్రహాలు ఆలస్యం అయ్యాయి. ప్రస్తుతం దూల్ పేట్(dhulphet)నుంచి భారీ విగ్రహాలు రాత్రింబవళ్లు తేడా లేకుండా నగరం మొత్తం బయలు దేరుతున్నారు. అయితే ఇటీవల నిర్మించిన నూతన కట్టడాలు, ఫ్లై ఓవర్ బ్రీడ్జుల కారణంగా.. గతంలో రెగ్యులర్ గా విగ్రహాలను తీసుకెళ్లే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఆ బ్రీడ్జీల కింద నుంచి భారీ విగ్రహాలను తీసుకెళ్లే క్రమంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ప్రజలు అంటున్నారు.


Similar News