TGSP : తెలంగాణ పోలీసు శాఖలో మరో సంచలనం.. 10 మందిని ఏకంగా సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు

లేవనెత్తిన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని రోడ్డు ఎక్కిన 39 మంది తెలంగాణ స్పెషల్ పోలీస్ (TGSP) సిబ్బంది‌పై రాష్ట్ర ప్రభుత్యం ఇప్పటికే సస్పెన్షన్ వేటు వేసింది.

Update: 2024-10-28 01:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: లేవనెత్తిన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని రోడ్డు ఎక్కిన 39 మంది తెలంగాణ స్పెషల్ పోలీస్ (TGSP) సిబ్బంది‌పై రాష్ట్ర ప్రభుత్యం ఇప్పటికే సస్పెన్షన్ వేటు వేసింది. అయితే, రాష్ట్ర డీజీపీ (DGP) హెచ్చరించినా ఆయా బెటాలియన్ల పరిధిలో పోలీసుల ఆందోళనలు ఆగడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా.. మరో 10 మంది బెటాలియన్ పోలీసులను (Battalion Police) ఏకంగా సర్వీస్ నుంచి తొలగిస్తూ తెలంగాణ పోలీసు శాఖ (Telangana Police Department) సంచలన నిర్ణయం తీసుకుంది. సర్వీస్ నుంచి తొలగించబడిన వారిలో 17వ బెటాలియన్ (సిరిసిల్ల)కు చెందిన ఆరుగురు కానిస్టేబుళ్లు, 12వ బెటాలియన్ (అన్నెపర్తి)కి చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు, 6వ బెటాలియన్ (కొత్తగూడెం)కు చెందిన ఒకరు ఉన్నారు.

ఈ మేరకు ఏడీజీ సంజయ్ (ADG Sanjay) అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు వృత్తిలో ఉండి ధర్నాలు, ఆందోళనలకు నాయకత్వం వహించారని.. నిరసనలను ప్రేరేపించి క్రమశిక్షణను ఉల్లంఘించారని అందుకే TGSP సిబ్బందిపై ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు వేసినట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాజ్యాంగం (Constitution)లోని ఆర్టికల్‌ 311 (Article 311) ప్రకారం.. మొత్తం 10 మంది సిబ్బందిని సర్వీస్ నుంచి తొలగిస్తూ చర్యలు తీసుకున్నారు. కాగా, తెలంగాణ స్పెషల్ పోలీస్ (Telangana Special Police) క్రమశిక్షణను పటిష్టం చేయడానికి ప్రధాన విలువలను నిలబెట్టడానికి, రాష్ట్రం అంతటా అంతటా బహిరంగ ప్రదేశాల్లో అనధికారిక ఆందోళనలు, సమ్మెల్లో పాల్గొన్నందున కొంతమంది సిబ్బందిని సర్వీస్ నుంచి తొలగిస్తున్నామని పోలీసు శాఖ (Police Department) ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది.

Tags:    

Similar News