MLC Kavitha: తెలంగాణలో అప్రజాస్వామిక పాలన.. ఎమ్మెల్సీ కవిత

శాసనమండలి (Legislative Council) సమావేశాల్లో భాగంగా లగచర్ల (Lagacharla) రైతులకు సంఘీభావంగా మండలికి నల్ల రంగు దుస్తులు తో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

Update: 2024-12-17 05:59 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: శాసనమండలి (Legislative Council) సమావేశాల్లో భాగంగా లగచర్ల (Lagacharla) రైతులకు సంఘీభావంగా మండలికి నల్ల రంగు దుస్తులు తో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఆవరణలో జై తెలంగాణ నినాదాలు చేస్తూ నల్ల రంగు దుస్తులు ధరించి వారు మండలిలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఎక్స్ వేదికగా ఈ వీడియోలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) పోస్ట్ చేస్తూ పలు విషయాలను పంచుకున్నారు. తెలంగాణపై అప్రజాస్వామిక పాలన చీకటి యుగం నడుస్తోందని తెలిపారు. భూములు కాపాడుతామంటూ లగ్గచెర్ల రైతులను అరెస్ట్‌ చేస్తుంటే సీఎం మాత్రం కార్పొరేట్‌ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ కఠోర అన్యాయం నిలబడదని, న్యాయం జరిగే వరకు రైతుల గొంతుకను శాసనమండలిలో ప్రతిధ్వనిస్తూనే ఉంటామని పేర్కొన్నారు. 

Tags:    

Similar News