ఏసీబీ కస్టడీకి ఉమామహేశ్వర్ రావు.. 3 రోజులు అనుమతించిన కోర్టు
ఆదాయానికి మించిన కేసులో అరెస్టైన సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును మూడు రోజుల కస్టడీకి నాంపల్లి ఏసీబీ కోర్టు మంగళవారం అనుమతించింది.
దిశ, క్రైమ్ బ్యూరో: ఆదాయానికి మించిన కేసులో అరెస్టైన సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును మూడు రోజుల కస్టడీకి నాంపల్లి ఏసీబీ కోర్టు మంగళవారం అనుమతించింది. ఏసీబీ అధికారులు ఉమామహేశ్వర్ రావును 8 రోజుల కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేయడంతో వాదనలు పూర్తైన నేపధ్యంలో నేటి నుంచి మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతిని ఇచ్చింది. బుధవారం ఉమామహేశ్వర్ రావును చంచల్ గూడ జైలు నుంచి ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. ఈ కస్టడీలోనే ఉమామహేశ్వర్ రావుకు సంబంధించిన 2 లాకర్‌లను తెరవడంతో పాటు, అతని వద్ద డైరీతో పాటు స్వాధీనం చేసుకున్న రూ.38 లక్షల నగదు, బయటపడ్డ 3.51 కోట్ల ఆస్తులకు సంబంధించిన ఆధారాల సేకరణపై విచారించనున్నారు.