Raja Pakala: జన్వాడ ఫామ్‌హౌస్ కేసు.. నేడు మోకిల పీఎస్‌కు రాజ్ పాకాల
జన్వాడ ఫామ్‌హౌస్ (Janwada Farm House) కేసు వ్యవహారం స్టేట్ పాలిటిక్స్ ( State Politics)లో హాట్ టాపిక్‌గా మారింది.
దిశ, వెబ్‌డెస్క్: జన్వాడ ఫామ్‌హౌస్ (Janwada Farm House) కేసు వ్యవహారం స్టేట్ పాలిటిక్స్ ( State Politics)లో హాట్ టాపిక్‌గా మారింది. కేసుకు సంబంధించి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ (BRS), అధికార కాంగ్రెస్ (Congress) నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే, కేసులో A1గా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) బావమరిదికి రాజ్ పాకాల (Raj Pakala) పోలీసుల ఎదుట హాజరయ్యేందుకు తెలంగాణ హైకోర్టు (Telangana High COurt) మంగళవారం వరకు గడువు ఇచ్చింది. ఈ క్రమంలో ఇవాళ ఆయన తన అడ్వొకేట్‌తో కలిసి మధ్యాహ్నం 12 గంటకు మోకిల పీఎస్ (Mokila Police Station)కు రానున్నారు. ఇప్పటికే రాజ్ పాకాల (Raj Pakala)కు పోలీసులు నోటీసులు జారీ చేయడంతో ఇవాళ ఆయనను విచారించే అవకాశం ఉంది.
కాగా, ఇదే కేసులో మరో కీలక నిందితుడైన విజయ్ మద్దూరి (Vijay Madduri) ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. ఈ మేరకు రాత్రి ఆయన ఇంట్లో పోలీసుల తనిఖీలు తనిఖీలు నిర్వహించారు. కేసులో విజయ్ ఫోన్ కీలకంగా మారడంతో దానిని స్వాధీనం చేసుకునేందుకు సోదాలు నిర్వహించారు. కానీ, విజయ్ మద్దూరి అందుబాటులో లేడని పోలీసులు తెలిపారు. అదేవిధంగా జన్వాడ ఫామ్ హౌస్ (Janwada Faram House)లో పార్టీ జరిగిన రోజు తన ఫోన్ బదులుగా వేరే మహిళ ఫోన్‌ను విజయ్ పోలీసులకు ఇచ్చాడు. దీంతో తన ఫోన్ తనకు ఇవ్వాలంటూ సోమవారం సదరు మహిళ మోకిల పోలీసులను (Mokila Police) ఆశ్రయించింది. దీంతో ఆ మహిళ స్టేట్‌మెంట్‌ను కూడా పోలీసులు రికార్ట్ చేశారు.