సెంట్రల్ సెన్సార్ బోర్డులోకి ఇద్దరు తెలంగాణ మహిళలు

కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డులో ఇద్దరు తెలంగాణ మహిళలకు అవకాశం లభించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా గోదావరిఖనికి చెందిన అల్లంశెట్టి హరిప్రియ, ఏ.వంశీప్రియలను బోర్డులో అడ్వయిజరీ ప్యానెల్ బోర్డు మెంబర్లుగా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Update: 2023-12-21 17:04 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డులో ఇద్దరు తెలంగాణ మహిళలకు అవకాశం లభించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా గోదావరిఖనికి చెందిన అల్లంశెట్టి హరిప్రియ, ఏ.వంశీప్రియలను బోర్డులో అడ్వయిజరీ ప్యానెల్ బోర్డు మెంబర్లుగా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. రెండేండ్ల పాటు ఈ బాధ్యతల్లో కొనసాగే వీరిద్దరూ తాజా సామాజిక స్థితిగతులపై అవగాహన ఉన్నవారేనన్నది కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ అభిప్రాయం. త్వరలోనే వీరిద్దరూ బాధ్యతలు తీసుకోనున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం (హైదరాబాద్) నుంచి జర్నలిజంలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అల్లంశెట్టి హరిప్రియ కొంతకాలం ప్రైవేటు టీవీ ఛానెళ్ళలో యాంకర్‌గా పనిచేశారు.

సమాజ పోకడలు, చలనచిత్రాల్లో పెడధోరణులు చోటుచేసుకుంటున్నాయని వస్తున్న విమర్శలు, నేర ప్రవృత్తికి కారణమవుతున్నాయని పోలీసు అధికారుల నుంచి వస్తున్న అభిప్రాయాలు.. వీటిపై ఒక జర్నలిస్టుగా విశ్లేషించిన అనుభవం సెన్సార్ బోర్డు సభ్యురాలిగా కలిసొచ్చే అంశం. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ నుంచి నియామక ఉత్తర్వులు రావడంతో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి అల్లంశెట్టి హరిప్రియ, ఏ.వంశీప్రియ కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    

Similar News