Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం.. తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు

తెలంగాణలో వర్షాలపై మరోసారి వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది

Update: 2023-11-17 04:25 GMT

దిశ,వెబ్ డెస్క్: మొన్నటి వరకు ఎండలతో అల్లాడిపోయారు.. కార్తీక మాసం మొదలైన తర్వాత నుంచి చలి ఎక్కువ అవ్వడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో వర్షాలపై మరోసారి వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రరూపం దాల్చినట్లు చెప్పింది. దీని ప్రభావంతో తెలంగాణ, తమిళనాడులోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని తెలిపారు. ఈనెల 18 నాటికి వాయుగుండ బంగ్లాదేశ్‌లోని ఖేపుపారమొంగ్లా మధ్య తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. ఉత్తర, ఈశాన్య దిశల నుంచి తెలంగాణ వైపునకు వీస్తున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో మరో 48 గంటల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అయితే, కొన్ని ప్రాంతాల్లో మబ్బులతో కూడిన వాతావరణం, జల్లులు పడే అవకాశం ఉందని అన్నారు. ఇక ఉత్తర తెలంగాణను చలి వణికిస్తోంది. ఉష్టోగ్రతలు తగ్గుతుండటంతో చలి తీవ్రత పెరుగుతుందని తెలిపారు. 

Tags:    

Similar News