రాంగ్ట్రీట్మెంట్ ఇచ్చిన ఇద్దరు డాక్టర్లు సస్పెండ్
రాష్ట్రంలో ఇద్దరి డాక్టర్లపై వేటు పడింది. తప్పుడు చికిత్సను అందించారంటూ తెలంగాణ మెడికల్కంప్లైట్ లో నమోదైన ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నామని టీఎంసీ చైర్మన్డాక్టర్ రాజలింగం గురువారం పేర్కొన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఇద్దరి డాక్టర్లపై వేటు పడింది. తప్పుడు చికిత్సను అందించారంటూ తెలంగాణ మెడికల్కంప్లైట్ లో నమోదైన ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నామని టీఎంసీ చైర్మన్డాక్టర్ రాజలింగం గురువారం పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లాలో డెంగ్యూ వ్యాధి చికిత్సలో నిర్లక్ష్యం చేయగా, పేషెంట్ చనిపోయినట్లు కలెక్టర్కు ఫిర్యాదు అందింది. దీంతో ఎంక్వైరీ తర్వాత మూడు నెలలపాటు చికిత్సను చేసిన డాక్టర్శ్రీకాంత్పై టీఎంసీ సస్పెన్సన్వేశారు. ఇక ఓపేషెంట్కు 14–07.2021న లెప్ట్లెగ్ప్యాక్చర్అయింది. ఆ తర్వాత రోజు కరన్ఎం పటేల్అనే డాక్టర్ విచిత్రంగా రైట్ లెగ్కు సర్జరీ చేశారు. ఆపరేషన్అనంతరం గుర్తించి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా, ఆరు నెలల పాటు టీఎంసీ సస్పెన్షన్ చేసింది.