TTD: ఈ నెల 6న టీటీడీ బోర్టు కొత్త చైర్మన్‌గా బీఆర్ నాయుడు బాధ్యతల స్వీకరణ!

టీటీడీ బోర్టు(TTD Board) కొత్త చైర్మన్(Chairman) గా బీఆర్. నాయుడు(BR Naidu) నియామకం అయిన విషయం తెలిసిందే.

Update: 2024-11-02 08:25 GMT
TTD: ఈ నెల 6న టీటీడీ బోర్టు కొత్త చైర్మన్‌గా బీఆర్ నాయుడు బాధ్యతల స్వీకరణ!
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: టీటీడీ బోర్టు(TTD Board) కొత్త చైర్మన్(Chairman) గా బీఆర్. నాయుడు(BR Naidu) నియామకం అయిన విషయం తెలిసిందే. అయితే ఆయన నవంబర్ 6న బాధ్యతలు స్వీకరించనున్నారు. కూటమి ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకు కొత్త పాలకవర్గాన్ని(TTD New Board) నియమిస్తూ గత నెల 30 ఉత్తర్వులు(Orders) జారీ చేసింది. ఇందులో టీటీడీ బోర్డు నూతన చైర్మన్ గా టీవీ5 అధినేత బీఆర్. నాయుడును నియమించింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 6న ఆయన బోర్డు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే బీఆర్ నాయుడు ఇప్పటికే శ్రీవాణి ట్రస్ట్ ను రద్దు చేస్తామని, కొండపై వాటర్ ప్లాంట్ లు, భక్తలకు గంటలోపల దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేస్తామని పలు ప్రకటనలు చేశారు. కాగా వైసీపీ అధికారం కోల్పోయాక గతంలో ఉన్న టీటీడీ బోర్టు పాలక వర్గం రాజీనామా చేసింది.

Tags:    

Similar News