ఫేక్ నెటిజన్ల విమర్శలు భరిస్తున్నం! కరెంట్ సిబ్బందిపై TSSPDCL పోస్ట్ వైరల్
సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ సంస్థల అధికార హ్యాండిల్స్ ప్రజల సమస్యలను తీరుస్తుంటాయి. పలు విషయాలపై సూచనలు ఇవ్వడంతో పాటు, పబ్లిక్ నుంచి కంప్లైంట్స్ స్వీకరిస్తుంటాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ సంస్థల అధికార హ్యాండిల్స్ ప్రజల సమస్యలను తీరుస్తుంటాయి. పలు విషయాలపై సూచనలు ఇవ్వడంతో పాటు, పబ్లిక్ నుంచి కంప్లైంట్స్ స్వీకరిస్తుంటాయి. నెటిజన్ల ఇచ్చే ఫిర్యాదులకు స్పందించి.. సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తాయి. ముఖ్యంగా తెలంగాణలో పోలీస్ డిపార్ట్‌మెంట్, జీహెచ్‌ఎంసీ, విద్యుత్ లాంటి ప్రభుత్వ సంస్థలకు ఎక్స్(ట్విట్టర్) వేదికగా అధికార హ్యాండిల్స్ ఉన్నాయి. అయితే నెటిజన్లు ఈ మధ్య విద్యుత్ సంస్థ అధికార హ్యాండిల్ అయిన టీఎస్ఎస్‌పీడీసీఎల్‌కు పవర్ కట్స్ విషయంలో ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి.
దీంతో సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా టీఎస్ఎస్‌పీడీసీఎల్ ఓ ట్వీట్ చేసింది. అర్థరాత్రి సమయంలో చికటీలో కరెంట్ పోల్‌పైకి ఎక్కి.. సిబ్బంది కరెంట్ పనులు చేస్తున్న వీడియో పోస్ట్ చేసింది. ‘నకిలీ నెటిజన్ల చేత విమర్శలు సైతం భరిస్తూ.. అర్ధరాత్రి సమయంలోనూ కష్టపడి పనిచేస్తున్న మా టీఎస్ఎస్‌పీడీసీఎల్ సిబ్బంది’ అని పేర్కొంది. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎంవో ఆఫీస్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సంస్థ చైర్మన్ ముషారఫ్ అలీ ఫారూఖీకి ట్యాగ్ చేశారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ అయ్యింది. ‘మీ హార్డ్ వర్క్‌ను సపోర్ట్ చేస్తాం.. అభినందిస్తున్నాము.. కానీ సమస్య అని ఫిర్యాదు చేస్తే ‘ఫేక్ నెటిజన్స్’ అని అలా ఎలా చెబుతారని నెటిజన్లు మండిపడుతున్నారు. మరోవైపు గత కొన్ని రోజులుగా తెలంగాణలో కొన్ని రోజులుగా కరెంట్ కోతలు ఉన్నాయని నెటిజన్లు కంప్లైంట్ చేస్తున్నారు.