హైదరాబాద్ వాసులకు TSRTC భారీ గుడ్ న్యూస్.. ఇకపై రూ.90లకే ఆ టికెట్

టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ తెలిపింది. నగరంలోని ఆర్టీస్ బస్సుల్లో ఇప్పటి వరకు రూ. 100లకు విక్రయిస్తున్న టీ-24 టికెట్ ధరను తగ్గిస్తున్నట్లు టీఎస్ ఆర్టీసీ ప్రకటించింది.

Update: 2023-04-26 13:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త తెలిపింది. నగరంలోని ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటి వరకు రూ. 100లకు విక్రయిస్తున్న టీ-24 టికెట్ ధరను తగ్గిస్తున్నట్లు టీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. ఇకపై రూ. 90లకే టీ-24 టికెట్ ఇస్తామని ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. అంతేకాకుండా సీనియర్ సిటిజన్లకు మరింత వెసులుబాటు కల్పించింది. సాధారణంగా ఇకపై రూ. 90కు విక్రయించే టీ-24 టికెట్‌ను సీనియర్ సిటీజన్లకు రూ.80‌లకే ఇవ్వనున్నట్లు తెలిపింది.

ఇక, ఈ టీ- 24 టికెట్ తీసుకున్న ప్రయాణికులు హైదరాబాద్‌లో 24 గంటలు తిరిగేందుకు అవకాశం ఉంటుంది. అన్ని ఆర్టీసీ బస్సుల్లోని కండక్టర్ల వద్ద ఈ టికెట్ అందుబాటులో ఉంటుంది. నష్టాల బాటలో ఉన్న టీఎస్ ఆర్టీసీ.. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు వినూత్న ప్రయోగాలు చేపడుతోంది. అందులో భాగంగానే తీసుకు వచ్చిన ఈ టీ- 24 టికెట్ ప్లాన్ సక్సెస్ అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో హైదరాబాద్‌లో దూరం ప్రయాణించే వారికి ఈ టీ- 24 టికెట్ ఎంతో ఉపయోగపడుతోంది. 

Tags:    

Similar News