TSPSC లీకేజీ వ్యవహారం : బీజేపీ సంచలన నిర్ణయం

ఇటీవల వెలుగు చూసిన టీఎస్పీఎస్సీ పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

Update: 2023-03-22 09:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల వెలుగు చూసిన టీఎస్పీఎస్సీ పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై అధికార పార్టీని కార్నర్ చేస్తూ ప్రతిపక్షాలు ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా లీకేజీ అంశంపై బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈనెల 25న బీజేపీ మహాధర్నా చేయనున్నట్లు ప్రకటించింది. ఇందిరా పార్క్ వేదికగా ఈ ధర్నా చేపట్టనున్నట్లు తెలిసింది. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీని నిరసిస్తూ బీజేపీ ధర్నా చేపట్టనుంది. మా నౌకర్లు మాకు కావాలి పేరుతో బీజేపీ దీక్షకు పూనుకుంది. 

Tags:    

Similar News