TSPSC: హార్టికల్చర్ పరీక్ష వాయిదా
కస్టడీ ముగియటంతో టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు నిందితులు నలుగురిని సిట్అధికారులు మంగళవారం కోర్టులో హాజరుపరిచారు.
దిశ తెలంగాణ క్రైం బ్యూరో: కస్టడీ ముగియటంతో టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు నిందితులు నలుగురిని సిట్అధికారులు మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్విధించటంతో నిందితులను జైలుకు తరలించారు. అంతకుముందు వీరికి కోఠి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు జరిపించారు. ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో మరిన్ని వివరాలను రాబట్టాల్సి ఉన్నందున ప్రవీణ్, రాజశేఖర్రెడ్డి, లద్యావత్దాక్యా, రాజేశ్వర్నాయక్, షమీమ్, రమేశ్, సురేష్‌లను కస్టడీకి అనుమతించాలంటూ సిట్అధికారులు నాంపల్లి కోర్టులో పిటీషన్వేసిన విషయం తెలిసిందే. అయితే, కోర్టు ప్రవీణ్, రాజశేఖర్రెడ్డి, లద్యావత్దాక్యా, రాజేశ్వర్నాయక్లను మాత్రమే మూడు రోజుల కస్టడీకి అనుమతించింది. ఈ క్రమంలో వీరిని శనివారం అదుపులోకి తీసుకున్న సిట్అధికారులు విచారణ జరిపారు. అయితే, దీంట్లో పెద్దగా కీలకమైన వివరాలు ఏవీ వెల్లడి కాలేదని తెలిసింది.
హార్టీకల్చర్పరీక్ష వాయిదా...
ఇదిలా ఉండగా ఏప్రిల్4వ తేదీన జరగాల్సి ఉన్న హార్టీకల్చర్పరీక్షను టీఎస్పీఎస్సీ బోర్డు జూన్17వ తేదీకి వాయిదా వేసింది. ప్రశ్నాపత్రాల లీకేజీతో ఇప్పటికే ప్రకటించిన పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను మారుస్తున్నట్టు టీఎస్పీఎస్సీ బోర్డు అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సమయం పడుతున్న నేపథ్యంలోనే హార్టీకల్చర్ పరీక్షను వాయిదా వేసినట్టు సమాచారం.