Long Jump వివాదంపై TSLPRB కీలక ప్రకటన

తెలంగాణలో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌కు సంబంధిచిన ఈ వెంట్స్ పూర్తైన విషయం తెలిసిందే. గతం కన్న ఈ సారి లాంగ్ జంప్ 4 మీటర్లు పెంచడం వలన ఈ వెంట్స్

Update: 2023-01-07 02:56 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌కు సంబంధించిన ఈవెంట్స్ పూర్తైన విషయం తెలిసిందే. గతం కన్న ఈసారి లాంగ్ జంప్‌ను నాలుగు మీటర్లకు పెంచడం వలన చాలామంది అభ్యర్థులు అర్హత సాధించలేకపోయామంటూ గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాలు. ఈ నేపథ్యంలో తాజాగా లాంగ్‌జంప్‌ వివాదంపై టీఎస్ఎల్‌పీఆర్బీ స్పందించింది. ప్రతీ వంద మందిలో 83 మంది లాంగ్‌జంప్‌లోనూ క్వాలిఫై అయ్యారు. కేవలం 17 శాతం మందికోసమే రాజకీయం చేస్తున్నారు కొందరని ఉద్దేశించి ప్రకటన విడుదల చేశారు. ఇక తొలిసారి ప్రతి అభ్యర్థికి డిజిటల్ ఆర్ఎఫ్ఐడీ రిస్ట్ బ్యాండ్ అందించి పారదర్శకంగా లాంగ్ జంప్ నిర్వహించామని తెలిపింది. దీనిపై రాజకీయం చేయొద్దని, ఫిజికల్‌ టెస్టులు పాసైన అభ్యర్థులు తుది పరీక్షకు సిద్ధం కావాలని తెలిపింది.

Also Read...

మాస్టర్ ప్లాన్‌పై హైకోర్టుకు రామేశ్వర్ పల్లి రైతులు 

Tags:    

Similar News