టీఎస్ సెట్ పరీక్షలు సజావుగా నిర్వహించాలి: విద్యాశాఖ మంత్రి ఆదేశాలు
తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల్లో, ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలు (టీఎస్ సెట్- 2023) మే నెలలో ప్రారంభం కానున్నాయి.
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల్లో, ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలు (టీఎస్ సెట్- 2023) మే నెలలో ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి లోపాలు లేకుండా ప్రవేశ పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని యూనివర్సిటీల కన్వీనర్లను, అధికారులను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర ఉమ్మడి ప్రవేశ పరీక్షలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ఆయా యూనివర్సిటీల వీసీలు, ప్రవేశ పరీక్షల కన్వీనర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. టీఎస్ సెట్ అభ్యర్థులు పరీక్షా కేంద్రాల లోకేషన్లను గుర్తించేందుకు వీలుగా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. హాల్ టికెట్‌పై ఇచ్చే సూచనలను తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.