TS RTC: ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్.. ఆ పాస్ మీ దగ్గర ఉంటే లక్కులో పడ్డట్టే

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్న టీఆర్ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది.

Update: 2024-05-07 16:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్న టీఆర్ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఎక్స్‌‌ప్రెస్‌ బస్సుకు సంబంధించి మంత్లీ సీజన్‌ పాస్‌ కలిగి ఉన్న వారు డీలక్స్‌ బస్సుల్లోనూ ప్రయాణించే వెసులుబాటును కల్పించింది. రూ.20 కాంబినేషన్‌ టికెట్‌ తీసుకుని డీలక్స్‌ బస్సుల్లో వారు దర్జాగా ప్రయాణించవచ్చని అధికారులు వెల్లడించారు. ఎక్స్‌‌ప్రెస్‌ పాస్‌ ఉన్న వారికి మాత్రమే ఈ సదుపాయం వర్తిస్తుందని పేర్కొన్నారు. కాంబినేషన్‌ టికెట్‌ సదుపాయాన్ని వినియోగించుకుని డీలక్స్‌ బస్సుల్లో ప్రయాణించాలని ప్రయాణికులను సంస్థ ప్రయాణికులకు సూచిస్తోంది. 100 కి.మీ పరిధిలో జారీ చేసే ఈ పాస్‌ కావాలనుకునే వారు టీఎస్‌ ఆర్టీసీకి చెందిన స్థానిక బస్‌‌పాస్‌ కౌంటర్లను సంప్రదించి పొందాలని ఆర్టీసీ అధికారులు తెలిపారు. 

Tags:    

Similar News

టైగర్స్ @ 42..