TS: నిరుద్యోగులకు శుభవార్త.. నోటిఫికేషన్ విడుదల

రాష్ట్రంలో ఉద్యోగ నియామక ప్రక్రియలో భాగంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త నోటిఫికేషన్ మంగళవారం విడుదల చేసింది.

Update: 2022-11-29 13:08 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఉద్యోగ నియామక ప్రక్రియలో భాగంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త నోటిఫికేషన్ మంగళవారం విడుదల చేసింది. గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్ విభాగంలో ఖాళీగా ఉన్న 57 పోస్టులను భర్తీ చేయనున్నారు. 32 గెజిటెడ్, 25 నాన్ గెజిటెడ్ పోస్టులున్నట్లు టీఎస్ పీఎస్సీ ప్రకటించింది. నాన్ గెజిటెడ్ కేటగిరీలోని పోస్టులకు వచ్చేనెల 7 నుంచి అప్లికేషన్ల స్వీకరణ మొదలవుతుందని, డిసెంబర్​ 28, సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. ఈ విభాగంలో హైడ్రోజియాలజికల్ టెక్నికల్ అసిస్టెంట్ 7, హైడ్రాలజీ టెక్నికల్ అసిస్టెంట్ 5, జీయోఫిజిక్స్ టెక్నికల్ అసిస్టెంట్ 8, ల్యాబ్ అసిస్టెంట్ 1, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ 4 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. టీఎస్​పీఎస్సీ వెబ్ సైట్‌లో దీనికి సంబంధించిన వివరాలను అప్​లోడ్​చేశారు.

ఇక, గెజిటెడ్ కేటగిరీలో 32 పోస్టులుండగా, వీటికి డిసెంబర్ 6 నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తామని, అదేనెల 27న సాయంత్రం 5 గంటల వరకు ఆఖరు తేదీగా ఖరారు చేశారు. ఈ విభాగంలో అసిస్టెంట్​హైడ్రోమెట్రాజలిస్టు 1, అసిస్టెంట్ కెమిస్ట్​4, అసిస్టెంట్​జియోఫిజిస్ట్​6, అసిస్టెంట్ హైడ్రోజియాలజిస్ట్​16, అసిస్టెంట్ హైడ్రాజలిస్ట్​5 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి మార్చి లేదా ఏప్రిల్ నెలలో పరీక్షలు ఉంటాయని, కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్ మెంట్ టెస్ట్, లేదా ఆఫ్ లైన్ ఓఎమ్మార్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుందని టీఎస్ పీఎస్సీ వెబ్ సైట్‌లో పేర్కొన్నారు. ఈ పోస్టులకు పోటీపడే అభ్యర్థులకు సంబంధించిన అర్హతలన్నీ వెబ్​సైట్‌లో స్పష్టం చేశారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..