TS Elections : CM KCRపై డీకే శివకుమార్ ఫైర్!

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ KCRపై ఫైర్ అయ్యారు.

Update: 2023-11-25 09:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. కర్ణాటకలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. కేసీఆర్ అబద్ధాల కోరు అన్నారు. కర్ణాటకకు రావాలని వచ్చి చూస్తే అక్కడ అభివృద్ధి ఎలా ఉందో చూడొచ్చన్నారు. తాము వస్తామంటే విమానం, లేదా బస్సు ఏర్పాటు చేయడానికి రెడీ అన్నారు. తొలి కేబినెట్ లోనే ఆరు గ్యారంటీలకు ఆమోదముద్ర వేశామన్నారు. కేసీఆర్ కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పనిచేశారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయన్నారు. సీఎం ఎంపిక పార్టీ నిర్ణయిస్తుందన్నారు. కేసీఆర్ కాంగ్రెస్ వస్తే సీఎంలను మారుస్తుందంటున్నారని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ నమ్ముతున్నందుకు థ్యాంక్స్ అన్నారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..