TS EAMCET 2023 : అభ్యర్థులకు బిగ్ అలర్ట్

మే 10 నుంచి 15 వరకు ఎంసెట్ అగ్రికల్చర్, ఇంజనీరింగ్ పరీక్షలు జరగనున్నాయి.

Update: 2023-04-29 02:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: మే 10 నుంచి 15 వరకు ఎంసెట్ అగ్రికల్చర్, ఇంజనీరింగ్ పరీక్షలు జరగనున్నాయి. దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 10తో గడువు ముగిసింది. అయితే మే 2 వరకు అపరాధ రుసుముతో అవకాశం ఉంది. దీంతో ఎంసెట్ దరఖాస్తుకు మరో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉంది. శుక్రవారం వరకు మొత్తం 3,19,947 మంది ఎంసెట్ కు దరఖాస్తు చేసుకున్నారు.

ఎంసెట్‌కు ప్రతి 100 మందిలో ముగ్గురు లేట్ ఫీజుతో దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. రూ.250- రూ.5వేల వరకు అదనంగా చెల్లిస్తుండటం గమనార్హం. రూ.5వేల ఇప్పటి వరకు 59 మంది దరఖాస్తు చేసుకున్నారు.ఇప్పటి వరకు మొత్తం 8,394 మంది ఆలస్య రుసుముతో ఎగ్జామ్ రాయడానికి అప్లై చేసుకున్నారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ రెండు పరీక్షలకు 372 మంది అప్లై చేసుకున్నారు.

Tags:    

Similar News