ఆ పోస్టులు పెంచండి.. TRTRSACA డిమాండ్

గ్రూప్-II, గ్రూప్-III, గ్రూప్-IV నోటిఫికేషన్‌లలో ప్రభుత్వం టైపిస్ట్ , స్టెనోగ్రాపర్ పోస్ట్‌లు పెంచాలని తెలంగాణ రికగ్నైజ్డ్ టైప్ రైటింగ్ షార్ట్ అండ్ కంప్యూటర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ బాలిగ కోరారు. ...

Update: 2024-06-20 16:41 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రూప్-II, గ్రూప్-III, గ్రూప్-IV నోటిఫికేషన్‌లలో ప్రభుత్వం టైపిస్ట్ , స్టెనోగ్రాపర్ పోస్ట్‌లు పెంచాలని తెలంగాణ రికగ్నైజ్డ్ టైప్ రైటింగ్ షార్ట్ అండ్ కంప్యూటర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ బాలిగ కోరారు. గురువారం హైదరాబాదులో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్‌కు వినతి పత్రం అందజేశారు. గత ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని సతీష్ వివరించారు . రాష్ట్రంలో టైప్ నేర్చుకున్న విద్యార్థులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సతీష్ బాలిగ మీడియాతో మాట్లాడుతూ తమిళనాడు ప్రభుత్వం 2024 జనవరిలో టైపిస్ట్, స్టెనో గ్రాఫర్ కలిపి 2,094 పోస్టులు విడుదల చేశారని, తమిళనాడు తరహాలో తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయమని నిరుద్యోగులను ఆదుకోవాలని కోరారు. ఇదే విషయాన్ని పది సంవత్సరములనుండి అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టు తిరిగి విజ్ఞప్తి చేస్తున్న ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ రెండు వృత్తి నైపుణ్య శిక్షలో ఉత్తీర్ణత సాధించి పట్టాలు పొంది కొలువులకోసం లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారన్నారు. టెక్నాలజీ పేరుతో వృత్తి నైపుణ్య శిక్షణను నిర్లక్ష్యం చేశారని, టెక్నాలజీని కూడా అందిపుచ్చుకుంటామని అన్నారు. ఈ విషయాలపై ఎమ్మెల్యే శ్రీ గణేష్సానుకూలంగా స్పందించారని, ఈ సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిక్షరిస్తానని హామీ ఇచ్చారని పేర్కొన్నారు తమిళనాడు తరహా విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేశం, ఫని, వివేక్, వంశీ, రాజేశ్వర్, రామచందర్, శేకర్, వేమన్ రెడ్డి, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.


Similar News