ఇబ్రహీంపట్నంలో విషాదం.. TRS సర్పంచ్ సూసైడ్
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని మూలరాంపూర్ గ్రామానికి చెందిన అధికార టీఆర్ఎస్ సర్పంచ్ ఆత్మహత్య చేసుకోవడం
దిశ, ఇబ్రహీంపట్నం: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని మూలరాంపూర్ గ్రామానికి చెందిన అధికార టీఆర్ఎస్ సర్పంచ్ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. గ్రామస్తుల వివరాల ప్రచారం... మూల రాంపూర్ గ్రామానికి చెందిన సర్పంచ్ సుంచు సంతోష్(34) తోటలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గత సంవత్సర కాలంగా అప్పులు పెరిగిపోవడంతో ఎలా తీర్చాలో తెలియక మానసిక క్షోభను అనుభవిస్తూ ఆదివారం తన వ్యవసాయ తోటలో ఉరి వేసుకున్నట్లు తెలిపారు. మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.