నల్లగొండను ఆక్రమించిన గులాబీ.. కాంగ్రెస్ కంచుకోటను ఢీకొట్టిన కారు
టీఆర్ఎస్ పార్టీ నల్లగొండను కైవసం చేసుకుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, 2018 ఎన్నికల్లో 9 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది.
దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ పార్టీ నల్లగొండను కైవసం చేసుకుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, 2018 ఎన్నికల్లో 9 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. హుజూర్ నగర్, నకిరేకల్, మునుగోడు ఈమూడింటిలో కాంగ్రెస్ విజయం సాధించింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ ఎంపీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించడంతో హుజూర్ నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్ పద్మావతి పోటీ చేసి ఓడిపోయారు. టీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డి విజయం సాధించారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ ను గెలుపొంది టీఆర్ఎస్ లో చేరారు. ఇక మునుగోడు నుంచి గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బైపోల్ లో ఓడిపోయారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 నియోజకవర్గాలకు పన్నెండింటిని టీఆర్ఎస్ కైవసం చేసుకున్నట్లయింది.
చరిత్ర సృష్టించిన గులాబీ
తెలంగాణ వచ్చిన తర్వాత ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకోవడం సాధ్యం కాలేదు. 2014 కోదాడ, హుజూర్ నగర్, నాగార్జున సాగర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 2018లోనూ హుజూర్ నగర్, నకిరేకల్, మునుగోడులో కాంగ్రెస్ విజయం సాధించింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కంటిలో నలుచులా తయారైంది. హుజూర్ నగర్ , నాగార్జున సాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కైవసం చేసుకోగా, నకిరేకల్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ చేరారు. దీంతో నల్లగొండలో 12 స్థానాల్లో టీఆర్ఎస్ పాగా వేసి చరిత్ర సృష్టించింది. ఏ పార్టీకి సాధ్యం కాని విధంగా టీఆర్ఎస్ విజయం సాధించింది.
Read more :