TRS ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం: లక్ష్మీ పూజకోసమే ఫాంహౌజ్‌కు వెళ్లారా..?

రాష్ట్రంలో సంచలనం రేపిన TRS ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పోలీసులు అరెస్ట్ చేసిన ముగ్గురు నిందితుల రిమాండ్‌ను ఏసీబీ కోర్ట్ తిరస్కరించింది.

Update: 2022-10-28 02:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో సంచలనం రేపిన TRS ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పోలీసులు అరెస్ట్ చేసిన ముగ్గురు నిందితుల రిమాండ్‌ను ఏసీబీ కోర్ట్ తిరస్కరించింది. దీంతో పోలీసులు వారికి 41 సీఆర్‌పీసీ కింది నోటీసులు ఇచ్చి.. ఈ రోజు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. నిందితులు శంషాబాద్ పోలీస్ స్టేషన్ నుండి ఇంటికి వెళ్లారు. కాగా, ఈ వ్యహహారంలో ఫాంహౌజ్‌లో పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుడు నందకుమార్ మీడియాతో మాట్లాడాడు. పూజల కోసమే ఫాంహౌజ్‌‌కు వెళ్లామని తెలిపాడు. ఎమ్మెల్యేల కొనుగోలు అనేది అవాస్తవం అని.. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదు చేసినట్లు తెలియదన్నారు.

ఫాంహౌజ్‌‌లో ఉన్న నలుగురు ఎమ్మెల్యేల్లో నాకు ఒక్కరే తెలుసని చెప్పారు. సింహయాజీ స్వామితో సామ్రాజ్యలక్ష్మీ పూజ జరిపించేందుకు ఫాంహౌజ్‌‌కు వెళ్లామని క్లారిటీ ఇచ్చారు. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలోనే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. అసలు ఏ సమాచారంతో సోదాలు చేశారో తమకు తెలియదన్నారు. న్యాయస్థానంలో న్యాయమే గెలిచిందని.. త్వరలో మీడియాకు వివరాలు అన్ని వెల్లడిస్తానని పేర్కొన్నాడు.


Similar News