నాకు అప్పగించిన పని పూర్తిచేశా.. TRS MLA సంచలన పోస్ట్
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రాష్ట్రంలో హాట్టాపిగ్గా మారింది. ఈ నేపథ్యంలో పినపాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఫేస్బుక్లో పెట్టిన పోస్టు ఆసక్తికరంగా మారింది.
దిశ, వెబ్డెస్క్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రాష్ట్రంలో హాట్టాపిగ్గా మారింది. ఈ నేపథ్యంలో పినపాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఫేస్బుక్లో పెట్టిన పోస్టు ఆసక్తికరంగా మారింది. బాధ్యత కలిగిన భారత పౌరుడిగా.. క్రమశిక్షణ కలిగిన బీఆర్ఎస్ కార్యకర్తగా గర్వపడుతున్నానని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు నాకు పార్టీ అప్పగించిన పని విజయవంతం చేశానని వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిబద్ధత చూసి గర్వపడండి అంటూ కార్యకర్తలకు సూచించారు.