ముగిసిన TRS LP సమావేశం.. 'ముందస్తు'పై తేల్చేసిన KCR

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని ఎమ్మెల్యేలు

Update: 2022-11-15 11:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం కేసీఆర్ దిశానిర్ధేశం చేసినట్లు సమాచారం. ఈ సమావేశంలో టీఆర్ఎస్ శాసనససభపక్షం, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. సమావేశానికి ఫాంహౌజ్ ట్రాప్డ్ ఎమ్మెల్యేలు కేసీఆర్ వెంటే వచ్చారు. కాగా, ఈ సమావేశంలో మునుగోడులో పనిచేసిన నేతలను అభినందిస్తూ తీర్మానం చేశారు. ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారం విస్తృతమైన నేపథ్యంలో సొంత పార్టీ వివరాలు బయటకు లీక్ కాకుండా సమావేశాల హాల్‌లోకి మొబైల్ ఫోన్లను నిరాకరించారు.

Read more:

1.తెలంగాణ భవన్‌లో కొత్త రూల్స్.. షాకైన మంత్రులు, ఎమ్మెల్యేలు!

Also Read: నిమ్మ తొక్కలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

Tags:    

Similar News