Transgender Dance: ముజ్రా పార్టీ పేరుతో ట్రాన్స్జెండర్లతో అసభ్య డ్యాన్స్‌లు
రంగారెడ్డి జిల్లాలోని బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆలీనగర్‌లో ముజ్రా పార్టీ పేరుతో అర్థనగ్న డ్యాన్సులు చేస్తున్న ఘటన చోటు చేసుకుంది.
దిశ, బడంగ్ పేట్: గత సెప్టెంబరు 30వ తేదీన నగర శివార్లలోని బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ముజ్రా పార్టీ పేరుతో అర్థనగ్న డ్యాన్సులు చేస్తున్న నలుగురు ట్రాన్స్జెండర్లతో కలిసి మరో 8 మందిని పోలీసులు అరెస్ట్‌చేసిన ఘటన మరువక ముందే రంగారెడ్డి జిల్లాలోని బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆలీనగర్‌లో మరో ఘటన చోటు చేసుకుంది. ముజ్రా పార్టీల పేరుతో ట్రాన్స్జెండర్లతో అర్థనగ్నంగా డ్యాన్యులు చేయిస్తున్న ఉదంతం నగర శివార్లలో తీవ్ర కలకలం రేపుతోంది. వీకెండ్‌లలో అర్థరాత్రులు ట్రాన్స్జెండర్లతో అసభ్యకర డ్యాన్సులు చేయిస్తూ యువతను రెచ్చగొట్టి డబ్బులు లాగుతున్నారు కొంతమంది. అంతేకాకుండా మత్తులో తూగుతూ.. రెచ్చిపోయి చుట్టుపక్కల వారికి ఇబ్బందులు కలిగిస్తున్నారు. తరచు ఆలీనగర్‌లో ట్రాన్స్జెండర్లతో వీకెండ్‌లలో అర్థరాత్రులు పెద్ద పెద్ద శబ్దాలతో అర్థనగ్న డ్యాన్సులు చేయిస్తూ న్యూసెన్స్చేస్తుండడంతో స్థానికులు ముజ్రాపార్టీ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీల పేరుతో బస్తీలలో ఎందుకు న్యూసెన్స్చేస్తున్నారని గొడవకు దిగారు. ఈ క్రమంలోనే ముబీన్ మీర్జా అనే స్థానికుడు బాలాపూర్పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అలాగే ముజ్రాపార్టీకి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో బాలాపూర్పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆదివారం అర్థరాత్రి ముజ్రాపార్టీ నిర్వహించిన నిర్వాహకుల కోసం గాలిస్తున్నారు.