Telangana Police: తెలంగాణలో డీఎస్పీల బదిలీలు

తెలంగాణణ పోలీసు శాఖలో డీఎస్పీలు బదిలీలు అయ్యారు.

Update: 2024-11-07 09:44 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో 9 మంది డీఎస్పీలు (Transfers of DSPs) బదిలీ అయ్యారు. ఈ మేరకు గురువారం డీజీపీ జితేందర్  (DGP Jitender) ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం జగిత్యాల డీఎస్పీ, డీసీఆర్‌బీగా ఉన్న జీ.మహేశ్ బాబుని కరీంనగర్ డీఎస్పీ, పీటీసీగా బదిలీ చేశారు. కరీంనగర్ డీఎస్పీ, పీటీసీగా ఉన్న బీ.రామానుజంను కాగజ్‌నగర్ ఎస్‌డీపీవోగా, కాగజ్‌నగర్ ఎస్‌డీపీవోగా ఉన్న ఏ.కరుణాకర్‌ను అసిఫాబాద్ ఎస్‌డీపీవోగా బదిలీ చేశారు. వనపర్తి డీఎస్పీ, డీసీఆర్‌బీగా ఉన్న కే.క్రిష్ణ కిశోర్‌ను తొర్రూర్ (మహబుబాబాద్) ఎస్‌డీపీవోగా, నిర్మల్ డీఎస్పీ, డీసీఆర్‌బీగా ఉన్న పీ.రవీందర్ రెడ్డిని ఖమ్మం ఏసీపీ, సీసీఆర్‌బీగా బదిలీ చేశారు. ఖమ్మం ఏసీపీ, సీసీఆర్‌బీ డి.ప్రసన్న కుమార్‌ను మెదక్ ఎస్‌డీపీవోగా ట్రాన్స్‌పర్ చేశారు. ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉన్న అధికారి ఎస్ఆర్ దామోదర్ రెడ్డిని అంబర్‌పేట్ డీఎస్పీ, పీటీసీగా బదిలీ చేశారు. ఇక అసిఫాబాద్ ఎస్‌డీపీవోగా ఉన్న పి.సదయ్యను, తొర్రూర్ ఎస్‌డీపీవోగా ఉన్న వి.సురేశ్‌ను హైదరాబాద్‌లోని చీఫ్ ఆఫీస్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. వీరంతా కొత్త పోస్టింగ్ ప్రదేశాల్లో తక్షణమే రిపోర్టు చేయాలని డీజీపీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

Tags:    

Similar News

టైగర్స్ @ 42..