TG Govt: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌లు, ఐఎఫ్‌ఎస్‌ల బదిలీ

తెలంగాణ(Telangana)లో 13 మంది ఐఏఎస్‌లు, 3 ఐఎఫ్‌ఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం(Telangana Govt) ఉత్తర్వులు జారీ చేసింది.

Update: 2024-10-28 14:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ(Telangana)లో 13 మంది ఐఏఎస్‌లు, 3 ఐఎఫ్‌ఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం(Telangana Govt) ఉత్తర్వులు జారీ చేసింది. నల్లగొండ జిల్లా కలెక్టర్‌గా త్రిపాఠి, రంగారెడ్డి కలెక్టర్‌గా నారాయణ రెడ్డి, యాదాద్రి కలెక్టర్‌గా హనుమంత రావు, మున్సిపల్ శాఖ డైరెక్టర్‌గా టీకే శ్రీదేవి, సీసీఎల్ఏ డైరెక్టర్‌గా మందా మకరందు, ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్‌గా ఎస్. హరీష్, నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా దిలీప్ కుమార్, టూరిజం డైరెక్టర్‌గా జెడ్‌కే. హనుమంతు, ఆర్ అండ్ ఆర్, భూసేకరణ కమిషనర్‌గా వినయ్ కృష్ణారెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శిగా ఆయేషా మస్రత్ ఖన్నం, వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్‌గా నిఖిల్ చక్రవర్తి, డెయిరీ కార్పొరేషన్ ఎండీగా చంద్రశేఖర్ రెడ్డి, క్రీడాశాఖ డైరెక్టర్‌గా సోని బాలాదేవీ, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఎండీగా కొర్రా లక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ ఎండీగా ఎన్. క్షితిజ, జీహెచ్‌ఎంసీ అర్బన్ ఫారెస్ట్రీ అదనపు కమిషనర్‌గా సుభద్రాదేవీ, వికారాబాద్ డీఎఫ్‌గా జి.జ్ఞానేశ్వర్‌లకు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి(CS Shanti Kumari) సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

Tags:    

Similar News