KCR మూలాలు బీహార్‌లో ఉన్నాయనే అనుమానం కలుగుతోంది: Raghunandan Rao
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలో 93 మంది ఐపీఎస్‌ల బదిలీలను ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే చేసిందని బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలో 93 మంది ఐపీఎస్‌ల బదిలీలను ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే చేసిందని బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు.ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల ప్రభుత్వం బదిలీలు చేసిన ఐపీఎస్‌ల జాబితా ఎన్నికల టీమ్ అని ప్రచారం జరగుతోందని అన్నారు. ట్రాన్స్ ఫర్లలో తెలంగాణ కేడర్‌కి చెందిన ఒక్క ఐపీఎస్‌కు కూడా మంచి పదవి ఇవ్వలేదన్నారు. సీఎం కేసీఆర్ మూలాలు బీహార్‌లోనే ఉన్నాయనే అనుమానం కలుగుతోందని.. అందుకే బీహార్‌కి చెందిన అధికారులకే కీలక పదవులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఏపీ కేడర్‌కి చెందిన, ప్రస్తుత తెలంగాణ ఇన్‌ఛార్జ్ డీజీపీ అంజనీ కుమార్ కూడా బీహార్‌కు చెందినవారేనని పేర్కొన్నారు.
అంతేకాకుండా ఏపీ కేడర్‌కు చెందిన తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కూడా బీహార్‌కు చెందినవారేనని చెప్పారు. ఇక కేటీఆర్ తనపై చేసే విమర్శలకు రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. తనపై మంత్రి కేటీఆర్ లేనిపోని విమర్శలు చేస్తున్నారన్నారు. తాను ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నానని.. ఆ సమయంలో తనపై విమర్శలు చేసే కేటీఆర్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. సిద్దిపేట, సిరిసిల్లలో నా పరపతి ఉందో లేదో వచ్చే ఎన్నికల్లో చూపిస్తానని తెలిపారు. ఎంఐఎం 50 సీట్లలో కాకుంటే.. 119 స్థానాల్లో పోటీ చేయండని.. కానీ బీఆర్ఎస్‌కు ఓటేసినా, ఎంఐంఎంకు ఓటేసినా ఒక్కేటేనని అన్నారు.
Also Read...