ఇంగ్లీష్ మీడియం.. టీచర్లకు 21వ తేదీ నుంచి ట్రైనింగ్

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం అన్ని

Update: 2022-03-19 03:26 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీష్​ మీడియం విద్యాబోధనను అమలు చేయనుంది. కాగా ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన ట్రైనింగ్​కు సంబంధించిన షెడ్యూల్​ను శుక్రవారం ప్రకటించింది. ఆన్​లైన్, ఆఫ్​లైన్​విధానంగా ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ప్రైమరీ టీచర్లకు, సెకండరీ టీచర్లకు వేర్వేరు తేదీల్లో తరగతుల నిర్వహణ కొనసాగనుంది.

ప్రాథమిక పాఠశాలలకు చెందిన టీచర్లకు ఈనెల 21వ తేదీ నుంచి శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. మూడు విడతల్లో ఈ శిక్షణ కొనసాగనుంది. మొదటి విడతలో భాగంగా ఈనెల 25 వరకు వారికి ఐదు రోజుల పాటు ప్రత్యక్ష పద్ధతిన ట్రైనింగ్​ఇచ్చేలా అధికారులు కార్యాచరణ రూపొందించారు. అనంతరం 26వ తేదీ నుంచి ఏప్రిల్​16వ తేదీ వరకు ఆఫ్ లైన్​విధానంలో ట్రైనింగ్​ ఇవ్వనున్నారు. రెండో విడతలో ఈనెల 28 నుంచి ఏప్రిల్​ 1 వరకు ఆఫ్​లైన్, ఏప్రిల్​ 2 నుంచి వచ్చే నెల 23 వరకు ఆన్​లైన్​లో శిక్షణ ఇవ్వనున్నారు. మూడో విడతలో భాగంగా వచ్చే నెల 4వ తేదీ నుంచి 11 వరకు ఆఫ్​లైన్‌లో, ఏప్రిల్​12 నుంచి 30వ తేదీ వరకు ఆఫ్​లైన్​లో శిక్షణ ఇవ్వనున్నారు.

సెకండరీ స్కూల్ ​టీచర్లకు ఐదు రోజులు ప్రత్యక్షంగా, మూడు వారాలపాటు పరోక్ష పద్ధతిన శిక్షణ నిర్వహించనున్నారు. సబ్జెక్టులవారీగా రెండు బ్యాచులుగా విభజించి ట్రైనింగ్​ఇవ్వనున్నారు. గణితం, ఫిజికల్​సైన్స్, బయో సైన్స్, సోషల్​బోధించే ఫస్ట్​బ్యాచ్​టీచర్లకు మార్చి 28 నుంచి ఏప్రిల్​23 వరకు, రెండో బ్యాచ్​కు ఏప్రిల్​11 నుంచి మే 7వ తేదీ వరకు ట్రైనింగ్​ఇచ్చేలా కార్యాచరణ రూపొందించారు.

Tags:    

Similar News