Minister Damodara : ట్రాఫిక్ నియంత్రణకు ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పోలీసులు ట్రాఫిక్ నియంత్రణకు ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.

Update: 2024-10-16 09:10 GMT

దిశ, సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పోలీసులు ట్రాఫిక్ నియంత్రణకు ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని సీఎస్ఐ చర్చి వద్ద ట్రిపుల్ ఎస్ ఆధ్వర్యంలో గ్లాన్ ఫార్మా కంపెనీ సహకారంతో కొనుగోలు చేసిన ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ బైకులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ… జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణ తో పాటు ప్లడ్ నివారణకు తోడ్పడేలా బైకునుల ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ట్రిపుల్ ఎస్ అనేది 2021లో సొసైటీ ఏర్పడ్డదని, అన్ని కంపెనీలు కలిసి ఏర్పాటు చేసుకున్న ట్రిపుల్ ఎస్ కాన్సెప్ట్ అనేది చాలా బాగుందని, ఓ రకంగా ఇది సీఎస్ఆర్ లాంటిదన్నారు. ఓ పార్టనర్ షిప్ లో కాంట్రిబ్యూషన్ చాలా బాగుందని కితాబిచ్చారు.

ట్రాఫిక్ క్లియరెన్స్, లా అండ్ ఆర్డర్, ప్లడ్ లను నివారించేందుకు ఉపయోగపడుతుందని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సూచించారు. ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ కోసం కొనుగోలు చేసిన ఒక్కో బైక్ విలువ సుమారు రూ. 2లక్షలు, 10 బైకులు కొనుగోలు చేశారన్నారు. గతంలో సినిమాలో చేసేవాళ్లం బైక్ పై వెలుతుంటే ఎంతటి వారైనా వారికి సైడ్ ఇవ్వడం చేసేవాళ్లమని, ఈ నాడు మన ప్రాంతం, మన జిల్లాలో చక్కటి సందేశాన్ని ఇస్తున్న వారికి అభినందనలు అన్నారు. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చూడడం దీని ఉద్దేశమని సంగారెడ్డికి ఆరు బైకులు, అమీన్ పూర్, పటాన్ చెరు లకు చెరో బైకు, జహీరాబాద్ కు రెండు బైకులు అందించారని, బైక్ లు సేవలు ప్రజలకు ఉపయోగపడాలన్నారు.

గ్లాన్ ఫార్మా కంపెనీ జిల్లా అభివృద్ధికి సహకరించాలని సూచించారు. ఎస్పీ రూపేష్ మాట్లాడుతూ… ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ కంపెనీలలో పనిచేస్తున్న మహిళల రక్షణకు ఉపయోగపడుతుందన్నారు. పరిశ్రమలు ఉన్న ప్రాంతాల్లో రాత్రి వేళలో డ్యూటీ నుంచి వచ్చే మహిళలకు ఇబ్బందులు లేకుండా చూడడం, అదే విధంగా రాత్రి టైంలో కంపెనీలలో దొంగతనాలు నివారించడం జరిగేందుకు ఉపయోగపడుందని తెలిపారు. గ్లాన్ ఫార్మా కంపెనీ 10 బెకులను అందించినందున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ రూపేష్, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, కాంగ్రెస్ నాయకులు చెర్యాల ఆంజనేయులు, కూన సంతోష్ తదితరులు పాల్గొన్నారు.


Similar News