బీజేపీలో బీసీలపై వివక్ష.. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్
బీసీలపై బీజేపీ పార్టీ వివక్ష చూపుతుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: బీసీలపై బీజేపీ పార్టీ వివక్ష చూపుతుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. బండి సంజయ్ 3 ఏళ్లుగా కష్టపడినా.. ఢిల్లీలోని జాతీయ నాయకత్వం తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన మంగళవారం సోషల్ మీడియాల్లో ఫైర్ అయ్యారు. గతంలో సున్నా నుంచి బీజేపీని 2 శాతానికి తీసుకువచ్చిన ఘనత బండి సంజయ్దని కొనియాడారు. కానీ కేంద్రం కేసీఆర్ కనుసన్నల్లోనే నడుస్తుందన్నారు. అందుకే కేసీఆర్ సన్నిహితుడైన కిషన్ రెడ్డిని బీజేపీ అధ్యక్షుడిగా నియమించారన్నారు.
బీజేపీ వెనుకబడిన తరగతుల నాయకులను అన్యాయం చేస్తుందన్నారు.కేటీఆర్ అమిత్ షా ని కలిసి వారికి అనుకూలంగా ఉన్న వారిని అధ్యక్షుడిగా మార్చుకున్నారన్నారు. ఇప్పటికైనా బండి సంజయ్ గ్రహించి బీసీ, ఎస్టీ, ఎస్టీ లకు మేలు చేసే పార్టీలో చేరాలని మహేష్‌గౌడ్ హితవు పలికారు. బీజేపీ బీసీలకు వ్యతిరేఖి అని నొక్కి చెప్పారు.